వి ఎస్ టి కాలనీలో సిమెంటు రోడ్డు పూర్తి

_రెండేళ్ల నిరీక్షణకు తెర 

వి ఎస్ టి కాలనీలో సిమెంటు రోడ్డు పూర్తి

_ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి 

_ బస్తీ వాసుల ఆనందం

నాచారం , ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ వి ఎస్ టి కాలనీ రేణుక ఎల్లమ్మ గుడి ముందు ఉన్న రెండు వీధుల్లో సిమెంటు రోడ్డు నిర్మాణం ఎట్టకేలకు పూర్తైంది. సుమారు రెండేళ్ల క్రితం అప్పటి కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ రూ.20 లక్షల నిధులను మంజూరు చేయించినప్పటికీ, డ్రైనేజీ సమస్యల కారణంగా పనులు ప్రారంభం కాలేకపోయాయి. గడువు ముగియడంతో ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్లిన విషయం తెలిసిందే.తరువాత ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో సుమారు రూ.15 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగా, పనులు విజయవంతంగా పూర్తి చేశారు.అనంతరం మునుపటి రూ.20 లక్షల నిధులను తిరిగి సాధించి సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.ఇప్పటికే గుడి ముందు రహదారి పూర్తవగా, తాజాగా పక్క వీధిలో కూడా సిమెంటు రోడ్డు పనులు పూర్తి చేశారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి కావడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా సిమెంటు రోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి సహకరించిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్‌ను స్థానికులు శాలువాతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో సువర్ణ, సుగుణాకర్ రావు, వాసు, రోహిత్, రాము, చింటూ, విష్ణువర్ధన్, షాజర్, పీటర్, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .