ఉపాధి పనుల్లో భద్రత లేకపోవడంతో కూలీలకు ప్రమాదం.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

ఉపాధి పనుల్లో భద్రత లేకపోవడంతో కూలీలకు ప్రమాదం.

ఎల్కతుర్తి, ఏప్రిల్ 16( తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సురారం గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న సమయంలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. పనులు చేస్తుండగా నలుగురు కూలీలకు కంటి తీగలు  కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధితుల్లో కోరె అయిలయ్య, ఎంజాల వెంకటయ్యతో పాటు మరికొందరు కూలీలు ఉన్నారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వేగంగా సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉపాధి హామీ పనుల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా లేవని, కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వకుండా పనులు చేయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కూలీలకు కనీస భద్రత కూడా కల్పించకపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపై ఉపాధి పనులు నిర్వహించే ప్రతి ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను హెచ్చరిస్తున్నారు.IMG-20260416-WA0086

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .