చర్లపల్లి బస్టాండ్‌లో మహనీయుల విగ్రహాల తొలగింపు…

చర్లపల్లి బస్టాండ్‌లో మహనీయుల విగ్రహాల తొలగింపు…

_ఆందోళనలు, అరెస్టులు

_దళిత సంఘాల నిరసనలు ఉధృతం 

– సోమశేఖర్ రెడ్డితో పాటు 20 మంది అదుపులోకి

చర్లపల్లి, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ చర్లపల్లి బస్టాండ్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న దళిత సంఘాలు, వివిధ సంస్థల నాయకులు పెద్ద ఎత్తున చర్లపల్లి బస్టాండ్‌కు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి సోమశేఖర్ రెడ్డితో పాటు సుమారు 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను తొలగించడం అన్యాయమని, ఇది సామాజిక వర్గాల భావోద్వేగాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు.విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను విస్తరిస్తామని హెచ్చరించారు.ఇటీవలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే విగ్రహాలను తొలగించడం మహనీయులను అవమానించినట్టేనని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.IMG-20260416-WA0102

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .