రాజరాజేశ్వర గార్డెన్స్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

_ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు.

రాజరాజేశ్వర గార్డెన్స్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

హైదరాబాద్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

రాజరాజేశ్వర గార్డెన్స్‌లో కంటోన్మెంట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అంబేద్కర్  సమాజంలోని అంటరానితనం, అస్పృశ్యత వంటి సమస్యలను స్వయంగా అనుభవించి, వాటి నిర్మూలన కోసం రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఆయనను కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేయడం సరైంది కాదని, సమసమాజ స్థాపనకు మార్గదర్శకుడని పేర్కొన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా కుల వివక్ష పూర్తిగా తొలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సమానంగా అందరికీ చేరాలని అంబేద్కర్ ఆశయమని తెలిపారు. పేదల కు గూడు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.కంటోన్మెంట్ కార్మికులకు కంపాషినేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ సమంజసమని, మురికి కాలువలు శుభ్రం చేసే కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా ఈ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని గుర్తుచేశారు.షాపుల లీజులు ముగిసిన కారణంగా చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం తగదని విమర్శించారు. పేదలపై అన్యాయం జరిగితే తాను ముందుండి పోరాడతానని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అంబేద్కర్ ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, వాటి సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.IMG-20260414-WA0117

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .