విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

రవికుమార్ టిఆర్పి జిల్లా యూత్ అధ్యక్షులు 

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

వనపర్తి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

 విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ డిమాండ్‌ చేశారు.వనపర్తి జిల్లా విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ ఆధ్వర్యంలో టీజీఎస్పీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయం ముందు జరుగుతున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలుపుతూ పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.జీవో 11ను అమలు చేసి విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను ఉద్యోగులుగా మార్చాలని, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరారు.రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులు సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ వారికి న్యాయం జరగడం లేదన్నారు.కార్మికులు తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యేక పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అశోకు, తిరుపతయ్య, నరేష్‌, జగదీష్‌, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .