యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.

_మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పిలుపు

యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.

కాప్రా, ఏప్రిల్ 14: తెలంగాణ ముచ్చట్లు 

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని సాయి నగర్, పద్మశాలి టౌన్‌షిప్ ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని చదువుతో పాటు సమాజ సేవలో ముందుండాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లభిస్తున్న రిజర్వేషన్లు అంబేద్కర్ దూరదృష్టి ఫలితమని పేర్కొన్నారు.
దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘం మేడ్చల్ జిల్లా కోశాధికారి బర్ల భిక్షపతి ముదిరాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జోగరావు, సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు రాజు, నవీన్ గౌడ్, గజేందర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .