సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన…

ఎన్‌ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం.

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన…

పెద్దమందడి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వీణ్ గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజర్ల కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న 7 రోజుల జాతీIMG-20260413-WA0101య సేవా పథక (ఎన్‌ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం రెండో రోజు కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయం, నేల మట్టి మరియు నీటి పరీక్షలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ పి. గజానంద్ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారం పెరుగుతుందని, వంటగది వ్యర్థాలను కంపోస్ట్‌గా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వర్మి కంపోస్ట్ వినియోగంతో రసాయనాలపై ఆధారపడకుండా, పెస్టిసైడ్ వినియోగం తగ్గుతుందని వివరించారు.విద్యార్థులు భార్గవ్, అనూష, అంజలి, సింధు తదితరులు సేంద్రియ వ్యవసాయం పద్ధతులు, నేల మట్టి మరియు నీటి నమూనాల సేకరణ విధానాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్. రామకృష్ణ, ఉప సర్పంచ్ పి. సుజాత ఆనంద్, పంచాయతీ సెక్రెటరీ పి. రామ్ చరణ్, భూసార పరీక్ష నిపుణుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .