ప్రజావాణి అర్జీలకు వెంటనే పరిష్కారం కల్పించాలి.

ప్రజావాణి అర్జీలకు వెంటనే పరిష్కారం కల్పించాలి.

_మేడ్చల్–మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశాలు

_181 ఫిర్యాదులు స్వీకరణ 

– ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచన

IMG-20260413-WA0095

మేడ్చల్ మల్కాజ్గిరి, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించినప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జెడ్పీ సీఈవో కాంతమ్మతో కలిసి మొత్తం 181 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి అధికారిపై బాధ్యతగా ఉందన్నారు. అందువల్ల అర్జీల పరిశీలనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.తిరస్కరించాల్సిన దరఖాస్తుల విషయంలో కారణాలను స్పష్టంగా అర్జీదారులకు తెలియజేయాలని, స్వీకరించిన ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను ఆన్‌లైన్‌లో వెంట వెంటనే నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.