మల్లాపూర్‌లో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం.

మల్లాపూర్‌లో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం.

_భవాని నగర్‌లో పనులు ప్రారంభం 

– బస్తీ బాటలో ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకులుIMG-20260414-WA0120

మల్లాపూర్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. “బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా భవాని నగర్‌లోని స్ట్రీట్ నెం. 3, 15 ప్రాంతాలను సందర్శించిన స్థానిక నాయకుడు నెమలి అనిల్ కుమార్, అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు డ్రైనేజీ స్తంభించడంతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వివరించారు.సమస్యపై వెంటనే స్పందించిన అనిల్ కుమార్, సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు చేపట్టేలా చేశారు.అనంతరం అధికారులతో కలిసి ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన, భవాని నగర్‌లో కొత్త డ్రైనేజీ పైపుల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాథమిక వసతులు అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .