ప్లేస్మెంట్‌లో మెరిసిన సాయిస్ఫూర్తి విద్యార్థులు.
క్యాంపస్ డ్రైవ్‌లో 88 మందికి అవకాశం.
సత్తుపల్లి, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి గంగారం గ్రామం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో “ప్లేస్మెంట్ సక్సెస్ మీట్–2026” కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు నాలుగేళ్ల కష్టానికి ఫలితంగా మంచి ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలని సూచించారు. సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని కోరారు. కొత్త టెక్నాలజీలను నేర్చుకుని ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలషించారు. ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎన్.వి. కృష్ణారెడ్డి వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 88 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. పరీక్షలు పూర్తయ్యాక వారు ఉద్యోగాల్లో చేరనున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో శాలువాలతో సత్కరించడం జరిగింది. తమ మొదటి ఉద్యోగంపై విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం
చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments