రోడ్డు భద్రత, సురక్షితమైనా ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత .

పోలీస్ కమిషనర్ సునీల్ దాత్ .

రోడ్డు భద్రత, సురక్షితమైనా ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత .

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు )

రోడ్డు భద్రత, సురక్షితమైనా ప్రయాణం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని తగ్గించి, ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలను సమాయత్వం చేసేందుకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ విభాగాలు చెందిన అధికారులు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు  అవగాహన అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు.  గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి  అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లు వంటి చోట్ల ప్రజలను నేరుగా కలుసుకుని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనుక కూర్చునే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ సీట్ బెల్టులు ధరించాలన్నారు. - ఎడమ వైపు నుండి ఓవర్‌టేక్ చేయడం నిబంధన విరుద్ధమని, ఓవర్‌టేక్ కేవలం కుడి వైపు నుండి మాత్రమే చేయాలన్నారు. భారీ వాహనాలు, నెమ్మదిగా వెళ్లే వాహనాలు ఎడమ వైపున, మిగిలినవి కుడి వైపున నడపాలన్నారు. ప్రధాన రహదారులపై పార్కింగ్ చేయరాదన్నారు. పార్కింగ్ లైట్లు లేకుండా పార్కింగ్ చేయరాదన్నారు. వాహనాలపై రేడియస్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. రక్షణాత్మక డ్రైవింగ్ దృష్టి పెట్టాలని, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండటం చాల కీలకమని పేర్కొన్నారు. సురక్షితంగా రోడ్డు దాటడం కోసం పాఠశాలలు, పార్కుల దగ్గర రోడ్లపై "నెమ్మదిగా నడపండి" అనే సైన్ బోర్డులను గమనించాలని సూచించారు.
కార్యక్రమంలో రూరల్ ఇన్స్పెక్టర్ రాజు, విద్యుత్ శాఖ (ఏఈ) కోటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.IMG-20260413-WA0106

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.