జిల్లా కోర్టులో అంబేద్కర్ జయంతి న్యాయ విజ్ఞాన సదస్సు.
_రాజ్యాంగ విలువలు సమాజానికి మార్గదర్శకం
– న్యాయమూర్తులు
కుషాయిగూడ, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కుషాయిగూడలోని జిల్లా కోర్టులో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.సదస్సుకు చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు అధ్యక్షత వహించి అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ పితామహుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను ప్రజల జీవితాల్లో ఆచరణలో పెట్టాలని సూచించారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో న్యాయబద్ధమైన అవగాహన పెంపొందించడంలో ఇటువంటి సదస్సులు కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు దుర్గ ప్రసాద్, ప్రశాంతి, రాజు లాడే, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తది
తరులు పాల్గొన్నారు.సదస్సులో పాల్గొన్నవారు అంబేద్కర్ ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని, రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


Comments