రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత.
- ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.
- డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ.
సత్తుపల్లి, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో నిర్వహించిన “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ఎంవీఐ రాజశేఖర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ జి అశోక్ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీలో శిక్షణ పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదమని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడానికి ర్యాలీ నిర్వహించారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిపో నుంచి రింగ్ సెంటర్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం డిపో గేటు వద్ద ఉద్యోగులతో కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి అశోక్, ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐ రాజశేఖర్ రె
డ్డి, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి, ఏడీసీలు, సూపర్‌వైజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Comments