కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టినా… బోర్డుల్లో పాత పేర్లే

కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టినా… బోర్డుల్లో పాత పేర్లే

పెద్దమందడి,ఏప్రిల్16(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా సర్పంచ్‌లు ఎన్నికై బాధ్యతలు స్వీకరించినప్పటికీ, కార్యాలయంలో ఉన్న పేరుపలకల్లో ఇప్పటికీ పాత సర్పంచ్‌ల పేర్లే కొనసాగుతున్నాయి.ప్రజాప్రతినిధుల మార్పులు జరిగినా వాటిని ప్రతిబింబించే విధంగా అధికారిక రికార్డులు, పలకలు నవీకరించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించే ముఖ్య కార్యాలయంలోనే ఇలాంటి నిర్లక్ష్యం కనిపించడం పరిపాలనా లోపాలకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సరైన గుర్తింపు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని, వెంటనే పేరుపలకలను సరిచేసి ప్రస్తుత ప్రజాప్రతినిధుల వివIMG-20260416-WA0107రాలు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఈ లోపాలను వెంటనే సవరించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .