పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్.

పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

జమ్మికుంట, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

హుజూరాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. ఈ దిశగా జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ దవాఖానలకు డయాలసిస్ సెంటర్లు మంజూరు కావడం కీలక ముందడుగుగా పేర్కొన్నారు.
ప్రస్తుతం మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు, ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన వారు, డయాలసిస్ చికిత్స కోసం వరంగల్, కరీంనగర్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా, సమయ నష్టం, ప్రయాణ కష్టాలు కూడా భరిస్తున్నారు. ఈ సమస్యను ప్రజలు వొడితల ప్రణవ్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న మంత్రి సానుకూలంగా స్పందించి జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశారు. ఇప్పటికే జమ్మికుంట, హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలకు కలిపి రూ.30 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించగా, తాజా నిర్ణయంతో మరింత ఆధునిక వైద్య సదుపాయాలను అందించడానికి చర్యలు వేగవంతమయ్యాయి.
డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు కోసం అవసరమైన యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు, శిక్షణ పొందిన టెక్నీషియన్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సెంటర్లు ప్రారంభమైన తర్వాత ప్రతి రోజు పలువురు రోగులకు సమయానికి చికిత్స అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే స్థానికంగా రోగులకు సకాలంలో చికిత్స లభించడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో నియోజకవర్గంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రభుత్వ దవాఖానలను ఆధునికీకరించేందుకు, అదనపు వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదేవిధంగా, నియోజకవర్గంలోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా బలోపేతం చేసి అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ముందస్తు వైద్య పరీక్షలకు ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.
ప్రజలు ఈ కొత్త సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 16(తెలంగాణ ముచ్చట్లు ) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని ఇన్స్పెక్టర్ కరుణాకర్...
హుజురాబాద్‌లో ఏప్రిల్ 25న హిందూ స్వర్ణ శంకన సమ్మేళనం.
గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం
ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం