కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆనందం.
రామకృష్ణారెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్
పెద్దమందడి,ఏప్రిల్16(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం రైతు వేదికలో గురువారం 99 రోజుల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, రైతులు, మహిళలు, బలహీన వర్గాలకు అందుతున్న పథకాలను ఈ సమావేశంలో వివరించారు.ఈ సందర్భంగా వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతోందన్నారు.ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయడం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి కీలక నిర్ణయాలతో పేద ప్రజలకు ఊరట కలిగించిందన్నారు. అలాగే వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు మరింత సేవలు అందుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఆనందం, సంతృప్తి పెరుగుతోందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.పెద్దమందడి ఎస్ఐ జలంధర్ రెడ్డి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని సూచించారు.రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎమ్మార్వో, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments