దళిత రత్న పురస్కారం అందుకున్న కొరపాక అంజి మాదిగ

దళిత రత్న పురస్కారం అందుకున్న కొరపాక అంజి మాదిగ

_సామాజిక సేవలకు గుర్తింపుగా గౌరవం

_పేద విద్యార్థులకు సహాయం 

_ఉద్యమ సేవలకు ప్రశంసలు

ఉప్పల్, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు)

డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు, మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొరపాక అంజి మాదిగకు దళిత రత్న పురస్కారం ప్రదానం చేశారు.ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మార్గదర్శకత్వంలో సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ, పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు చేసిన సేవలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర విశేషమని కొనియాడారు.మహనీయుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దళిత బహుజన పేద వర్గాలకు అండగా నిలుస్తున్నందుకు ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని కొరపాక అంజి మాదిగ తెలిపారు.ఈ సందర్భంగా పురస్కారం అందజేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, జాతీయ కళామండలి అధ్యక్షుడు ఎన్.వై. అశోక్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో మరింత కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .