ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం

ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ కేసి కార్యాలయంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) శ్రీధర్, ఆర్డీఓ రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .