పీచర గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు 

పీచర గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు 

వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేసవి ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో వేలేరు మండలం పీచర గ్రామంలో ప్రజలకు మరియు ప్రయాణికులకు ఉపశమనం కలిగించే చర్యగా గ్రామ పంచాయతీ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు  ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ఎండల కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, కార్యదర్శి తోట అనిల్, వార్డు సభ్యులు జల్తారీ సుకన్య, ఓద్దుల శ్రీకాంత్, జేరుపోతుల జగన్, కొలిపాక వెంకటేష్, పురమణి కవిత, ఉప్పుల శ్రీధర్ రెడ్డి, గుడికందుల రాకేష్, గుండెల్లి సౌజన్య, ఎడ్ల అశ్విని, రామంచ ప్రశాంత్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .