సిద్దు టెంట్ హౌస్ లో ఉచిత వైద్య శిబిరం
Views: 9
On
కాజీపేట్ ఏప్రిల్ 18 ( తెలంగాణ ముచ్చట్లు)
బిఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శరణ్య హాస్పిటల్ సౌజన్యంతో కాజీపేట బాపూజీ నగర్ లోని సిద్దు టెంట్ హౌస్ ముందు శనివారం
ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్లు బి. వి. రెడ్డి, పూర్ణచందర్, జి. రాకేష్ రెడ్డి నర్స్ లు రజిని, గౌరీ, స్వాతి పాల్గొని ఈ హెల్త్ క్యాంపులో దాదాపు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. దాంతోపాటు సంవత్సరం పాటు ఉచితంగా ఓ పి కార్డులను ఇచ్చారు. ఈ సందర్భంగా గబ్బెట శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు శరణ్య ఆస్పటల్ యజమాన్యం ఇలాంటి సేవల అందించడం సంతోషకరమని హాస్పటల్ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పసునూరి మనోహర్, బొడ్డు దేవయ్య, గబ్బెట కరుణ్, కాలేశ్వరం శ్రీకాంత్ ,దుప్పటి పురుషోత్తం, నల్ల వెంకటస్వామి, జంగం బాబురావు, గబ్బెట తులసి ,కొడవటి రవి, ఆయనెల్లి శ్రీనివాస్, పిల్లల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments