గురువుకు గౌరవ వందనం – రిటైర్డ్ హెచ్ఎంను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Views: 5
On
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాసరావు విద్యా రంగంలో అనేక సంవత్సరాలు నిబద్ధతతో సేవలందించి, అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.ఆయనలాంటి గురువులు సమాజానికి మార్గదర్శకులని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా తమ అనుభవాన్ని సమాజానికి పంచుతూ సేవ చేయాలని ఆకాంక్షించారు.సన్మానానికి స్పందించిన శ్రీనివాసరావు తన సేవలను గుర్తించి గౌరవించినందుకు మాజీ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగంలో సేవ చేయడం తనకు గర్వకారణమని, విద్యార్థుల విజయమే తనకు నిజమైన పురస్కారమని అన్నారు. ఈ సన్మానం తనకు మరింత ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, కౌన్సిలర్ భారతి ప్రేమాత్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, చిట్యాల రాము, తోట శీను తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments