గ్రామస్థులకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యతపై చైతన్యం.

గ్రామస్థులకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యతపై చైతన్యం.

ఎల్కతుర్తి, ఏప్రిల్ 17( తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ, ఇందిరానగర్ గ్రామాల్లో బడిబాట కార్యక్రమం భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామస్థుల్లో ప్రభుత్వ విద్య ప్రాధాన్యతపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి గ్రామ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.
కోతులనడుమ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వల్లభాపూర్ ప్రధానోపాధ్యాయులు బద్దం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఇంటింటి ప్రచారం చేపట్టింది. 11 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. బడి వయస్సు ఉన్నప్పటికీ ఇంకా చేరని పిల్లలను గుర్తించడం, మధ్యలో చదువు మానేసిన వారిని తిరిగి విద్యలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అంగన్వాడీ నుంచి ఉన్నత పాఠశాల వరకు విద్యార్థుల నిరంతర విద్యను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, కృత్రిమ మేధ పై అవగాహన, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి సంస్థల సహకారంతో ఆధునిక విద్య అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా సౌకర్యాలు, ప్రత్యేక తరగతులు, సైకిళ్ల పంపిణీ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
ఇందిరానగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. “ప్రైవేట్ పాఠశాలలు వద్దు – ప్రభుత్వ పాఠశాల ముద్దు” అనే నినాదంతో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ బడిబాట కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ప్రభుత్వ విద్యపై అవగాహన పెరిగి, విద్యార్థుల చేరికలు పెరగాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.IMG-20260417-WA0044

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామస్థులకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యతపై చైతన్యం. గ్రామస్థులకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యతపై చైతన్యం.
ఎల్కతుర్తి, ఏప్రిల్ 17( తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ, ఇందిరానగర్ గ్రామాల్లో బడిబాట కార్యక్రమం భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామస్థుల్లో ప్రభుత్వ...
ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు
హుజురాబాద్‌లో ఏప్రిల్ 25న హిందూ స్వర్ణ శంకన సమ్మేళనం.
గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం
ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్