హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు.

హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు.

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ బస్సు డిపోలో ఆర్టీసీ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. పరిశీలకులుగా రవీందర్, వేల్పుల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జేఏసీ చైర్మన్‌గా టి.ఎస్. సింగ్, వైస్ చైర్మన్‌గా ఎం. రమేష్ ఎన్నికయ్యారు. కన్వీనర్లుగా అశోక్ బాబు, కిషోర్, రమేష్, పి.ఎస్. రెడ్డి నియమితులయ్యారు. కో-కన్వీనర్లుగా ఐలయ్య, శ్రీనివాస్, కేసీ పాణి, భాస్కర్, జ్యోత్స్న, సరస్వతి, వనజా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
మీడియా కన్వీనర్‌గా బి. తిరుపతి, ప్రచార కార్యదర్శి సహా ఇతర పదవులకు కూడా నాయకులను ఎన్నుకున్నారు. కొత్త కమిటీ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .