భీమదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు,
Views: 26
On
భీమదేవరపల్లి,మార్చి19(తెలంగాణ ముచ్చట్లు)
భీమదేవరపల్లి మండల పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. గ్రామ బస్టాండ్ సమీపంలో, హుస్నాబాద్ వైపు వెళ్లే రహదారిలో ముల్కనూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం, సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో TS 02 FG 0389 నంబర్ గల కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుడిని హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన చిరుమల్ల భాస్కర్‌గా గుర్తించారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రహదారి మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments