విద్యా సేవలకు గుర్తింపుగా పలుస శంకర్ గౌడ్‌కు దక్షిణ భారత స్ఫూర్తి అవార్డు

విద్యా సేవలకు గుర్తింపుగా పలుస శంకర్ గౌడ్‌కు దక్షిణ భారత స్ఫూర్తి అవార్డు

వనపర్తి,ఏప్రిల్19(తెలంగాణ ముచ్చట్లు):
 
శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వనపర్తి జిల్లాకు చెందిన పదవీ విరమణ పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, సాహిత్య కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్‌కు దక్షిణ భారతదేశ స్ఫూర్తి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియంలో ఆదివారం  ఘనంగా జరిగింది.శంకర్ గౌడ్ తన 36 ఏళ్ల విద్యాసేవలో పనిచేసిన ప్రతి పాఠశాలను అభివృద్ధి దిశగా నడిపించడంలో విశేష కృషి చేశారు. అక్షర దీక్ష, నైతిక విలువల బోధన, బాల్య వివాహాల నిర్మూలన, పుస్తక ప్రచార యాత్రలు, సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు వంటి అనేక విద్యా ఉద్యమాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువచ్చారు.అలాగే సాహిత్య కళా వేదిక ద్వారా సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ యువ రచయితలు, కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి వైస్ చైర్మన్ ఎటికాల పురుషోత్తం, సినీ కళాకారుడు పృథ్వీరాజ్, శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమల మనోహర్, పదవీ విరమణ పొందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .