మహిళా బిల్లుకు వ్యతిరేకించిన పార్టీలకు బుద్ధి చెప్పాలి.

రమేష్ బిజెపి మాజీ పెద్దమందడి మండల అధ్యక్షులు 

మహిళా బిల్లుకు వ్యతిరేకించిన పార్టీలకు బుద్ధి చెప్పాలి.

పెద్దమందడి,ఏప్రిల్19(తెలంగాణ ముచ్చట్లు):
 
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లుకు వ్యతిరేకించిన పార్టీలకు రానున్న రోజుల్లో మహిళలు బుద్ధి చెప్తారని పెద్దమందడి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం మహిళల సాధికారత దిశగా కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అయితే కొన్ని స్వార్థపూరిత రాజకీయ నాయకులు, కుటుంబ పాలనలో ఉన్న పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడం దురదృష్టకరమన్నారు.గతంలో కూడా దేవెగౌడ ప్రభుత్వ కాలంలోనూ, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 1996, 1998, 1999, 2002 సంవత్సరాల్లో మహిళా బిల్లుకు వ్యతిరేకత వ్యక్తమైందని గుర్తుచేశారు.ఇప్పటికీ కొన్ని కుటుంబ పార్టీలలో మార్పు రాలేదని విమర్శించారు.డిలిమిటేషన్ ప్రక్రియలో ఎవరికి అన్యాయం జరగదని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మహిళలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించేలా ఈ బిల్లు అమలవుతుందని తెలిపారు.మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువస్తే, కాంగ్రెస్ నాయకులు సహా మమతా బెనర్జీ, ఎం.కే. స్టాలిన్, అఖిలేష్ యాదవ్ తదితరులు వ్యతిరేకించడం సరైంది కాదన్నారు.ఇలాంటి పార్టీలకు రానున్న రోజుల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారని రమేష్ హెచ్చరించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):   కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అదుపు తప్పింది. ఇసుక దొరకడం కష్టంగా మారడంతో...
డంపింగ్ యార్డ్‌పై అగ్గిరాజేసిన నిరసనలు.
హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ
రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన 
రోడ్డు విస్తరణతో రోడ్డున పడిన చిరు వ్యాపారులు
భీమదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు,
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?