రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన
Views: 61
On
వేలేరు, ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో రోడ్డు దుస్థితి గ్రామస్తులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. గాంధీ సర్కిల్ నుండి వాటర్ ప్లాంట్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో రాకపోకలు కష్టంగా మారాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు రోజూ ఇబ్బందులు పడుతున్నారు.
అదే సమయంలో క్రెషర్ వాహనాల కోసం రోడ్డుపై ప్రతిరోజూ నీరు పోయడంతో బురదగా మారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments