హుజురాబాద్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…

రైతులకు మద్దతు ధర హామీ

హుజురాబాద్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 20 ( తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ మార్కెట్ యార్డులో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా అధికారులు, వ్యాపారులు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .