ఉపాధి కూలీల ఆందోళన.!
మూడు నెలలుగా బిల్లులు రాక ఇబ్బందులు.
Views: 47
On
సత్తుపల్లి, ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సత్తుపల్లి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద గ్రీవెన్స్ డే సందర్భంగా గ్రామీణ ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీబీజీ రాంజీ బిల్లును రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని, రెండుసార్లు ఫోటో సిస్టంను రద్దు చేయాలని, పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, తీవ్ర ఎండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు గత మూడు నెలలుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త పథకాలు ప్రవేశపెట్టి కూలీలకు పనులు తగ్గిస్తున్నారని విమర్శించారు. గతంలో 100 రోజుల పనికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు అందించేదని, ప్రస్తుతం కొత్త విధానంలో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల కూలీలకు గిట్టుబాటు కష్టమైందన్నారు. ఉపాధి కూలీలకు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలని, రోజువారీ కూలీ రూ.600గా నిర్ణయించాలని, కేంద్రం 90 శాతం నిధులు భరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉపాధి పనిని 150 రోజులకు పెంచడం, రోజుకూలి రూ.400 చెల్లించడం, పట్టణాల్లో ఉపాధి కల్పించడం, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద సంవత్సరానికి రూ.12,000 ఇవ్వడం, మహిళలకు నెలకు రూ.2,500 చెల్లించడం, పేదలకు ఇళ్లు కల్పించడం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, ఐద్వా మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, ప్రజానాట్య మండలి నాయకులు కండే సత్యం, అయినంపూడి సనందరావు, తడికమల్ల రామకృష్ణ, బెజవాడ లక్ష్మీనారాయణ, పరిమి సీతామాలక్ష్మి, వల్లెపు లక్ష్మి, వింజి భార్గవి, కారుమంచి శ్రీలక్ష్మి, మారోజు శ్యామల, గద్దల వెంకటేశ్వరరావు,
బలుసుపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు.
బలుసుపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Apr 2026 19:03:57
వనపర్తి,ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా...


Comments