రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.

రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.

- పీఎం కిసాన్, ఎరువుల సరఫరాపై ప్రభావం.
- ఏఓ ఎస్ .చంద్రశేఖర్ రెడ్డి. 

దమ్మపేట, ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు. మండలంలో మొత్తం 11,200 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 8,200 మంది మాత్రమే నమోదు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా సుమారు 3,100 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని పేర్కొన్నారు.
రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పీఎం కిసాన్, ఎరువుల సరఫరా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎక్కువగా నమోదు చేయించుకోలేదని తెలిపారు. అలాంటి రైతులు తమకు సమీపంలోని మీసేవ కేంద్రాలు, సిఎస్‌సి సెంటర్లు లేదా వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. మిగిలిన రైతులందరూ ఆలస్యం చేయకుండా రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .