అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ.

అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.

అశ్వారావుపేట, ఏప్రిల్‌ 20 (తెలంగాణ ముచ్చట్లు):

నియోజకవర్గ కేంద్రంలో విద్యా అభివృద్ధికి మరో ముందడుగు పడింది. స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన “కలికలు” పుస్తకాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆవిష్కరించారు. తదుపరి ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర వైద్య చికిత్సల సమయంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి ప్రాధాన్యమని, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, తుమ్మా రాంబాబు, జూపల్లి ప్రమోద్, కోలా లక్ష్మీనారాయణ, ఎంఈఓ ప్రసాదరావు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు హరిత, షహీనాబేగం, కొండలరావు, వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20260420-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .