తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం.

తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం.

వనపర్తి,ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి స్వగృహాల్లో ఘనంగా సన్మానించి అభినందించారు.గ్రామ మాజీ సర్పంచ్ సత్యం యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రాములు ద్వారా సమాచారం తెలుసుకున్న శంకర్ గౌడ్, వారితో కలిసి ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సుకన్య 987 మార్కులు, కళ్యాణి 825 మార్కులు సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు మేఘన 464, మరో విద్యార్థిని 458, బిందు 433 మార్కులు సాధించారు.అలాగే సుకన్య, మౌనిక, సతీష్, భారతి తదితరులను కూడా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.చదువుతో పాటు పరిసరాలు, సమాజం, కుటుంబం పట్ల అవగాహన పెంపొందించుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేశి రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకట్రాములు, నాగన్న, డా. నారాయణ, తెలుగు శ్రీను ఆంజనేయులు, సుక్య నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేసవి సెలవులు వృథా కాకుండా… విజ్ఞానంగా మార్చుకోండి. వేసవి సెలవులు వృథా కాకుండా… విజ్ఞానంగా మార్చుకోండి.
- అవసరానికి మాత్రమే ఫోన్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. - విద్యార్థులకు సూచనలు.    సత్తుపల్లి, ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):   స్థానిక పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో విద్యా...
తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం.
ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.
రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.
ఉపాధి కూలీల ఆందోళన.!
అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.
జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.