వేసవి సెలవులు వృథా కాకుండా… విజ్ఞానంగా మార్చుకోండి.
Views: 81
On
- అవసరానికి మాత్రమే ఫోన్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి.
- విద్యార్థులకు సూచనలు.
సత్తుపల్లి, ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో విద్యా సంవత్సరం ముగిసిన సందర్భంగా సోమవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, ఫైనల్ పరీక్షల సమాధాన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు హాజరై, తమ పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు, సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా విద్యా విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గణితం, తెలుగు, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, ఏఐ టెక్నాలజీ వంటి ముఖ్య అంశాల్లో పటిష్టమైన పునాది వేసుకోవాలని సూచించారు. వేసవి శిక్షణలో భాగంగా ఈ కోర్సులు విశ్వశాంతి విద్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లు కూడా విద్యార్థుల అభివృద్ధికి అవసరమని చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుపై దృష్టి పెట్టి రాబోయే విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉండాలని ప్రిన్సిపల్ సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments