వెల్టూర్ పాఠశాలకు పూర్వ విద్యార్థులు కుర్చీల విరాళం.
Views: 43
On
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్టూర్ లో 1997–98 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ మిత్రబృందం పాఠశాల ఆవరణలో సమావేశమై పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా 6 ఎస్ టైప్ కుర్చీలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్, డి నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి మరియు సంజీవ్ టీచర్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ మా సహకారం కొనసాగుతుంది అని తెలిపారు. 1997- 98 పదవ తరగతి పూర్వ విద్యార్థుల తరఫున ఈ సహాయం అందజేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తరఫున హెడ్మాస్టర్ బాణం విష్ణు వారి సేవా భావాన్ని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Apr 2026 22:13:18
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...


Comments