నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం

నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం

వనపర్తి,ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):

నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్‌ను నియమించారు.సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.ఈ సందర్భంగా డి. రవి ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభివృద్ధి ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి పౌరుడు ప్రశ్నించే స్వభావాన్ని అలవరచుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి, స్వార్థ రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను చైతన్యవంతం చేయడం ముఖ్య లక్ష్యమని తెలిపారు.స్వచ్ఛంద సంస్థల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని పేర్కొంటూ, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు.త్వరలోనే మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.ఈ బాధ్యతలను అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .