సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.

భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం.

సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.

సత్తుపల్లి, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
 
సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న జి. ప్రతాప్ రెడ్డి, టి. ప్రసాదరావు ఏఎస్ఐలకు ప్రభుత్వం ఉత్తమ సేవ పథకాన్ని మంజూరు చేసింది. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా మంగళవారం ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారం అందుకున్న ఏఎస్ఐలను సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి, ఎస్ఐలు ఎస్. వీరప్రసాద్, పి. ప్రదీప్, జి. అశోక్ కుమార్, ఎస్. నాగరాజు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఎన్. శ్రీనివాసరావు తదితర సిబ్బంది అభినందించారు.IMG-20260421-WA0116
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .