హుజురాబాద్‌లో వికలాంగుల సంక్షేమానికి తోడ్పాటు

ట్రై మోటరైజ్డ్ స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ

హుజురాబాద్‌లో వికలాంగుల సంక్షేమానికి తోడ్పాటు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్‌లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వికలాంగుల లబ్ధిదారులకు ట్రై మోటరైజ్డ్ స్కూటీలు మరియు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 8000 ఉపకరణాలను అందజేస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1500 స్కూటీలను మాత్రమే పంపిణీ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 2000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలను అందజేసిందని పేర్కొన్నారు.
ఈ ఉపకరణాల వల్ల వికలాంగుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. వాహనాలను అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .