మేడే ఘనంగా జరపాలి: సిపిఎం.
లేబర్ కోడ్‌ల రద్దుకు డిమాండ్.
Views: 30
On
సత్తుపల్లి, ఏప్రిల్ 28(తెలంగాణ ముచ్చట్లు):
మే 1న జరిగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)ను ఘనంగా నిర్వహించాలని సిపిఎం పిలుపునిచ్చింది. సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం రావి వీర వెంకయ్య భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్, నాయకుడు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం తర్వాత కార్మికులు సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం కార్మికులకు నష్టం కలిగిస్తోందని విమర్శించారు. వెంటనే ఆ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కార్మిక హక్కుల హననంపై పోరాటాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేడే సందర్భంగా ర్యాలీలు, సభలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొలికపోగు సర్వేశ్వరరావు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, సైదా, రాము, ఓలేటి శ్రీహరి, చెరుకు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments