వెల్టూర్ లో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు – జెండా ఆవిష్కరణ.
Views: 4
On
పెద్దమందడి,ఏప్రిల్27( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు మల్లక్ సురేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ స్థాపించబడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన ఈ పార్టీ, ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ ఉద్యమాన్ని విజయవంతం చేసి 2014లో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు.అనంతరం రాష్ట్ర అభివృద్ధి దిశగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.రైతులు, పేదలు, మహిళలు, యువత కోసం అనేక పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు.రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లక్ సురేష్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments