వడదెబ్బ నివారణకు అవగాహన పోస్టర్ ఆవిష్కరణ.

వడదెబ్బ నివారణకు అవగాహన పోస్టర్ ఆవిష్కరణ.

జమ్మికుంట టౌన్, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన “వడదెబ్బ ప్రమాదకరం – జాగ్రత్తలతో నివారణ సాధ్యం” అవగాహన పోస్టర్‌ను జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌తో కలిసి డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రజల్లో వడదెబ్బపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవలి రోజుల్లో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయట తిరగడం ఆరోగ్యానికి హానికరమని, వడదెబ్బ వల్ల ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు తలకు, చెవులకు గుడ్డ లేదా టవల్ కట్టుకోవడం ద్వారా ఎండ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు.
అలాగే రోజంతా తగినంత నీరు తాగడం, నిమ్మరసం, మజ్జిగ వంటి శీతల పానీయాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చని వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే నీడ ఉన్న ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం వంటి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు ఫిరోజ్, చింతల శ్రీనివాస్, సదానందం, ప్రతాప్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .