పాపక్కపల్లి మత్స్య సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.
నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక .
Views: 7
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం పాపక్కపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు ఎన్నికల అధికారి నాగుల మనోజ్ తెలిపారు. ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా పంజ రమేష్, ఉపాధ్యక్షుడిగా పుట్టకొక్కుల రమేష్, కార్యదర్శిగా పుట్టకొక్కుల రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గం ఎంపిక కావడం సంఘంలో ఐక్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని, మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారి ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments