ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

సత్తుపల్లి విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు. 

ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

సత్తుపల్లి, ఏప్రిల్ 23(తెలంగాణ ముచ్చట్లు):

పట్టణంలోనీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సత్తుపల్లి విద్యార్థులు జాతీయ ఒలింపియాడ్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హెచ్. ఝాన్సీ శ్రీ (గ్రేడ్–1) ఆల్ ఇండియా 1వ ర్యాంక్ సాధించగా, టి. దీక్షిత (గ్రేడ్–1) 5వ ర్యాంక్, ఆర్. యోగిత లక్ష్మి 3వ ర్యాంక్, పి. శ్రీనిధి (8వ తరగతి) 4వ ర్యాంక్‌లను సాధించారు. సీఎన్‌ఏపీఎస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఎస్‌ఎస్‌ఓ, ఎన్ టిఈఎక్స్ పరీక్షల్లో ఈ విద్యార్థులు క్యాంపస్ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు 1, 2, 3, 4 ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. హైదరాబాదులోని రవీంద్రభారతి వేదికపై జరిగిన కార్యక్రమంలో సీఎన్‌ఏపీఎస్ ప్రతినిధులు, తెలంగాణ నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, గోల్డ్ మెడల్స్, బహుమతులు అందజేసి సన్మానించారు. మొదటి స్థానం సాధించిన హెచ్. ఝాన్సీ శ్రీకి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు. కార్యక్రమంలో ఖమ్మం జోన్‌కు చెందిన ఏజీఎం, ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News