ఉపాధి పనుల వద్ద కార్మికులకు సదుపాయాలు.

ఉపాధి పనుల వద్ద కార్మికులకు సదుపాయాలు.

- ఎండ వేడిలో టెంట్ హౌస్ ఏర్పాటు.
- కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.
- సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్.
 
సత్తుపల్లి, ఏప్రిల్ 22(తెలంగాణ ముచ్చట్లు):
 
బేతుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న పనుల వద్ద కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పనిస్థలంలో టెంట్ హౌస్ ఏర్పాటు చేసి కార్మికులకు విశ్రాంతి కోసం అనుకూల వాతావరణాన్ని కల్పించారు. అదేవిధంగా, కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు చల్లని తాగునీటి క్యాన్లు అందుబాటులో ఉంచడంతో పాటు, డీహైడ్రేషన్ నివారణకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ చర్యలు కార్మికులలో ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, వారి ఆరోగ్య భద్రతపై గ్రామ పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు స్పష్టమైంది. ఈ సందర్భంగా సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పనులు సక్రమంగా సాగుతాయని, ఎండల ప్రభావం నుంచి వారిని కాపాడటం తమ బాధ్యత అని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులతో పాటు ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .