రైతులకు ఊరట- వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

రైతులకు ఊరట- వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

పెద్దమందడి,ఏప్రిల్22(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించే అవకాశాన్ని కల్పించడం ద్వారా మధ్యవర్తుల సమస్యలు తొలగి, న్యాయమైన ధర లభిస్తుందని తెలిపారు.రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.వరి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సకాలంలో పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించవచ్చని హామీ ఇచ్చారు.మహిళా సమాఖ్యల ద్వారా కేంద్రాల నిర్వహణ గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, వ్యవసాయ రంగానికి మద్దతు అందిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .