గ్రీన్ క్యాంపస్ లక్ష్యంగా చర్యలు.!

గ్రీన్ క్యాంపస్ లక్ష్యంగా చర్యలు.!

- భూమి వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం.
- ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు.
 
సత్తుపల్లి, ఏప్రిల్ 23(తెలంగాణ ముచ్చట్లు):
 
మండల పరిధిలోని బి.గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో భూమి వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం, క్యాంపస్ శుభ్రత, జీరో ప్లాస్టిక్ డ్రైవ్, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరత ప్రతిజ్ఞ, గ్రీన్ క్యాంపస్ మరియు కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమాల ద్వారా పర్యావరణ అవగాహనతో పాటు విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏప్రిల్ 22 నుండి 29 వరకు భూమి వారం సందర్భంగా భారత్ సస్టైనబిలిటీ మిషన్-2026 కింద పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డా. వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించేందుకు భారత్ సస్టైనబిలిటీ క్యాంపస్ మిషన్-2026 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ రహిత ప్రచారాలు, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పచ్చని, పరిశుభ్రమైన క్యాంపస్ నిర్మాణంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు, కళాశాల చైర్మన్ డా. బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్‌గా పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సైన్స్ అండ్ హ్యూమానిటీస్ విభాగాధిపతి డా. షేక్ మీరాసాహెబ్, వివిధ ఇంజనీరింగ్ శాఖల విభాగాధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు, విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20260423-WA0026
Tags:

Post Your Comments

Comments

Latest News