వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

పెద్దమందడి,ఏప్రిల్22(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్, పెద్దమందడి గ్రామాలలో  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ఎంపీ మల్లురవి మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ చర్యలను వివరించారు.రైతులు తమ వరి పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా న్యాయమైన ధరలు అందేలా ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .