ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడు దేవేందర్‌కు ఘన సన్మానం.

ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడు దేవేందర్‌కు ఘన సన్మానం.

పెద్దమందడి,ఏప్రిల్22(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర పాఠశాల ఉపాధ్యాయుడు దేవేందర్ ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్  ఎంపీ మల్లురవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్ వరప్రసాద్ రావు, పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత పాల్గొన్నారు.అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాణం విష్ణు, ఉపాధ్యాయులు వెంకటనారాయణ, రమేష్, మునీరుద్దీన్, శ్రీనివాసులు, మల్లయ్య, కళ్యాణి, రవి కుమార్, గోపాల్, ప్రశాంతి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్ ఏజీ ఆఫీస్ నుండి వచ్చిన పెన్షన్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ మంజూరు పత్రాన్ని దేవేందర్‌కు అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు దేవేందర్ సేవలను ప్రశంసిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .