బడి బాటతో ప్రభుత్వ విద్యకు కొత్త ఊపిరి.

బడి బాటతో ప్రభుత్వ విద్యకు కొత్త ఊపిరి.

ఎల్కతుర్తి, ఏప్రిల్ 22 ( తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలం భావుపేటలో బుధవారం “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భావుపేట, దండేపల్లి పాఠశాలల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బావుపేట స్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం ఎల్. మనోహర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా ఇంగ్లీష్ మీడియంలో సులభంగా అర్థమయ్యే విధంగా ప్రత్యేక బోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, రెండు జతల యూనిఫాంలు, పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు.
ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో బడి బాట ర్యాలీ నిర్వహించి విద్య ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరయ్య చారి, ఉపాధ్యాయులు ముకుంద రెడ్డి, శ్రీధర్, ఎం. రవికుమార్, పబ్బు రాజు, అనిత, శారద, ప్రభ, సునీత, రాధిక, పీఈటీ సుధాకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రీన్ క్యాంపస్ లక్ష్యంగా చర్యలు.! గ్రీన్ క్యాంపస్ లక్ష్యంగా చర్యలు.!
- భూమి వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం. - ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు.   సత్తుపల్లి, ఏప్రిల్ 23(తెలంగాణ ముచ్చట్లు):   మండల పరిధిలోని బి.గంగారం సాయిస్ఫూర్తి...
ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థుల అద్భుత ప్రతిభ.
డంపింగ్ యార్డ్‌పై హోరాహోరీ పోరాటం.
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో ఉద్రిక్త వాతావరణం.
హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్‌లో చర్చ.
ఉపాధి పనుల వద్ద కార్మికులకు సదుపాయాలు.