జీతం ఇవ్వడం లేదని వాటర్ మెన్ యాదగిరి ఆవేదన- కార్యదర్శి భిన్న వివరణ

జీతం ఇవ్వడం లేదని వాటర్ మెన్ యాదగిరి ఆవేదన- కార్యదర్శి భిన్న వివరణ

వేలేరు, ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలంలోని గుండ్లసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వాటర్ మెన్‌గా పని చేస్తున్న యాదగిరి, తనకు 14 నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి గత 8 సంవత్సరాలుగా ఇదే బాధ్యతలు నిర్వహించగా, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత రెండు సంవత్సరాలుగా తానే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు. అయినప్పటికీ గ్రామ సర్పంచ్, అధికారులు జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.
జీతం అందక కుటుంబ పోషణ కష్టమైందని, తనకు రావాల్సిన మొత్తం చెల్లించి న్యాయం చేయాలని యాదగిరి కోరాడు.ఇదిలా ఉండగా, ఈ విషయంపై వివరణ కోరగా గుండ్లసాగర్ పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ, గత నెలలోనే యాదగిరికి చెక్కు ద్వారా జీతం చెల్లించినట్లు తెలిపారు. యాదగిరి విధులకు హాజరు కావడం లేదని, పలుమార్లు పిలిచినా రానని చెప్పినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .