గురుకుల, సైనిక్ పాఠశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం.
Views: 8
On
పెద్దమందడి,ఏప్రిల్23(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల మరియు సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించేందుకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తుల చెన్నకేశవులు, సురేందర్, భాస్కర్ రావు, శాంతన్న హాజరై విద్యార్థులకు శాలువాలు కప్పి, మిఠాయిలు పంపిణీ చేసి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కోచింగ్ లేకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ విద్యార్థులు సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు ఇతర విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయుడు గోవర్ధన్ మరియు ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించారు.అలాగే గ్రామ సర్పంచ్ గంగరవి, వార్డు సభ్యులను కూడా ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments